మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Navagraha Beeja Mantras – నవగ్రహ బీజ మంత్రాః
– సంఖ్యా పాఠః –
రవేః సప్తసహస్రాణి చంద్రస్యైకాదశ స్మృతాః |
భౌమే దశసహస్రాణి బుధే చాష్టసహస్రకమ్ |
ఏకోనవింశతిర్జీవే భృగోర్నృపసహస్రకమ్ |
త్రయోవింశతిః సౌరేశ్చ రాహోరష్టాదశ స్మృతాః |
కేతోః సప్తసహస్రాణి జపసంఖ్యాః ప్రకీర్తితాః || 1
రవి – 7000
చంద్ర – 11000
భౌమ – 10000
బుధ – 8000
బృహస్పతి – 19000
శుక్ర – 16000
శని – 23000
రాహు – 18000
కేతు – 7000
– సంఖ్యా నిర్ణయం –
కల్పోక్తైవ కృతే సంఖ్యా త్రేతాయాం ద్విగుణా భవేత్ |
ద్వాపరే త్రిగుణా ప్రోక్తా కలౌ సంఖ్యా చతుర్గుణా || 2
ఇతి వైశంపాయనసంహితావచనమ్ |
– జపపద్ధతిః –
ఆచమ్య | ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ ______ గ్రహపీడాపరిహారార్థం ______ గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథాసంఖ్యకం ______ గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే ||
– సూర్యః –
ధ్యానం –
పద్మాసనః పద్మకరో ద్విబాహుః
పద్మద్యుతిః సప్తతురంగవాహః |
దివాకరో లోకగురుః కిరీటీ
మయి ప్రసాదం విదధాతు దేవః ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |
వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |
బీజమంత్రః –
ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః |
– చంద్రః –
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః |
చంద్రోఽమృతాత్మా వరదః కిరీటీ
శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః ||
బీజమంత్రః –
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః |
– భౌమః –
ధ్యానం –
రక్తాంబరో రక్తవపుః కిరీటీ
చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||
బీజమంత్రః –
ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః |
– బుధః –
ధ్యానం –
పీతాంబరః పీతవపుః కిరీటీ
చతుర్భుజో దండధరశ్చ సౌమ్యః |
చర్మాసిధృత్ సోమసుతః సు మేరుః
సింహాధిరూఢో వరదో బుధోఽస్తు ||
బీజమంత్రః –
ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః |
– బృహస్పతిః –
ధ్యానం –
స్వర్ణాంబరః స్వర్ణవపుః కిరీటీ
చతుర్భుజో దేవగురుః ప్రశాంతః |
దధాతి దండం చ కమండలుం చ
తథాఽక్షసూత్రం వరదోఽస్తు మహ్యమ్ ||
బీజమంత్రః –
ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః |
– శుక్రః –
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః |
తథాసి దండం చ కమండలుం చ
తథాక్షసూత్రాద్వరదోఽస్తు మహ్యమ్ ||
బీజమంత్రః –
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః |
– శనిః –
ధ్యానం –
నీలద్యుతిః నీలవపుః కిరీటీ
గృధ్రస్థితశ్చాపకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః
సదాస్తు మహ్యం వరమందగామీ ||
బీజమంత్రః –
ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః |
– రాహుః –
ధ్యానం –
నీలాంబరో నీలవపుః కిరీటీ
కరాళవక్త్రః కరవాలశూలీ |
చతుర్భుజశ్చర్మధరశ్చ రాహుః
సింహాధిరూఢో వరదోఽస్తు మహ్యమ్ ||
బీజమంత్రః –
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః రాహవే నమః |
– కేతుః –
ధ్యానం –
ధూమ్రో ద్విబాహుర్వరదో గదాభృ-
-ద్గృధ్రాసనస్థో వికృతాననశ్చ |
కిరీటకేయూరవిభూషితాంగః
సదాస్తు మే కేతుగణః ప్రశాంతః ||
బీజమంత్రః –
ఓం స్రాం స్రీం స్రౌం సః కేతవే నమః |
సమర్పణమ్ –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత ____ గ్రహస్య మంత్రజపేన ____ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.